Tuesday, 24 February 2009

Mine

02-Feb-2009---Blog Creation

ఆ చిన్న నవ్వే చాలు

ఆ చిన్న నవ్వే చాలు
అలలు అలలుగా ఎగిసే
భావాలకో ఆకారమివ్వడానికి

ఆ చిన్న నవ్వే చాలు
అలసిన ఊహలకు
సరికొత్త రెక్కలివ్వడానికి

ఆ చిన్న నవ్వే చాలు
యుగాల నిరీక్షణకు
ముగింపు నివ్వడానికి

ఆ చిన్న నవ్వే చాలు
రెప్పల మాటున దాగిన
స్వప్నాలకు సరికొత్త రంగులద్దడానికి

ఆ చిన్న నవ్వే చాలు
నన్ను మరచిన నేను
నీలో చిగురించడానికి