02-Feb-2009---Blog Creation
ఆ చిన్న నవ్వే చాలు
ఆ చిన్న నవ్వే చాలు
అలలు అలలుగా ఎగిసే
భావాలకో ఆకారమివ్వడానికి
ఆ చిన్న నవ్వే చాలు
అలసిన ఊహలకు
సరికొత్త రెక్కలివ్వడానికి
ఆ చిన్న నవ్వే చాలు
యుగాల నిరీక్షణకు
ముగింపు నివ్వడానికి
ఆ చిన్న నవ్వే చాలు
రెప్పల మాటున దాగిన
స్వప్నాలకు సరికొత్త రంగులద్దడానికి
ఆ చిన్న నవ్వే చాలు
నన్ను మరచిన నేను
నీలో చిగురించడానికి
hi hari blog related ga excellent lines n words. chala bagundi kavitha.
ReplyDeleteచాలా బాగుందండీ!
ReplyDeleteఆ చిన్న నవ్వే చాలు
ఎందరితోనో పరిచయాలు పెంచుకోవటానికి
ఆ చిన్న నవ్వే చాలు
ఎదుటివారిలో బెరుకు,భయాలను తుంచడానికి
ఆ చిన్న నవ్వే చాలు
శత్రువులను సైతం మిత్రులుగా మార్చడానికి
ఆ చిన్న నవ్వే చాలు
మనసులోని భారాన్ని దించుకోవడానికి
Thank you so much Andi
Delete